సూర్యభగవానునికి మార్తాండుడు, ఆదిత్యుడు వంటి పేర్లతో పాటూ సహిత మిహిరుడు, అర్కుడు, ప్రభాకరుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు వంటి అనేక పేర్లు ఉన్నాయి.
ఆ సూర్యభగవానుడు పన్నేండు రాశులలో పన్నేండు పేర్లతో సంచరిస్తూ ఉంటాడు. ఋషులు,గంధర్వులు,అప్సరసలు,నాగులు,యక్షులు కూడా సూర్యునితో పాటూ ఉంటారు.
ఈ విధముగా పన్నేండు నెలలలో, పన్నేండు పేర్లతో,పన్నేండు రూపాలతో సంచరిస్తూ ఉండటం వల్ల సూర్యభగవానునికి " ద్వాదశాత్ముడు" అనే పేరు వచ్చింది.
సూర్యుని నామాలు
చైత్ర మాసం - ధాత
వైశాఖ మాసం - ఆర్యమా
జ్యేష్ట మాసం - మిత్ర
ఆషాడ మాదం - వరుణ
శ్రావణ మాసం - ఇంద్ర
భాద్రపద మాసం - వివస్వాన
ఆస్వ్యుజ మాసం - పుషా
కార్తీక మాసం - పర్జన్య
మార్గశిర మాసం - అంసుమన్
పుష్య మాసం - భగ
మాఘ మాసం - తష్ట్యా
ఫాల్గుణ మాసం - విష్ణువు
నిజానికి సూర్యకిరణాల లీలా విలాసమే ఈ విశ్వమంతా!
ఓక్కొక్క మాసంలో ఒక్కొక్క విధముగా ఉంటుంది. ఆయామాసాలలో సౌర శక్తి విశేషాన్నే ఈ "ద్వాదశాదిత్యులు" అని పేర్కున్నారు.
సూర్యుడుని ఉపాసించినవారికి ఆయురారోగ్యాలు , ఐశవర్యం, అన్నసమృద్ధి లభిస్తాయి.
శ్రీ సూర్యనారయణ స్వామినే నమః.
No comments:
Post a Comment