ఆ.... పూర్వమే, అపూర్వం!
పూర్వం, విద్యార్థి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షించేవారు.
దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది.
1. మోకాళ్ళమీద కూర్చోబెడితే - వినయంగా ఉండాలని.
2. నోటిమీద వేలు వేసుకోమంటే నీగురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని.
3. చెవులుపట్టుకోమంటే- శ్రద్ధగా వినమని.
4. బెంచీ ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని.
5. చేతులెత్తి నిలబడమంటే- నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.
6. గోడవైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని.
7. తరగతిగది బయట నిలబెడితే - పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.
8. బ్లాక్ బోర్డ్ తుడవమంటే-తప్పులు సరిచేసుకోమని.
9. ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - గెలిచే వరకూ పోరాడమని.
No comments:
Post a Comment