ఇల్లు ఉడ్చేందుకు నియమాలు
ఇంట్లోంచి
ఎవరైనా బయటికి వెళ్తున్నపుడు లేదా వాళ్లు వెల్లిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు.
ఇలా చేస్తే వారు వెళ్లిన పని జరగదని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా బయటికి వెళ్లే వారు వాళ్ల గది నుంచి బయటికి వచ్చిన తర్వాత చీపురు అసలు వాడకూడదు.
చీపురు ఇక్కడ పెట్టకూడదు
బయటి
వ్యక్తుల చూపు పడని చోట చీపురు దాచి ఉంచాలి. తులసికోట, పూజగది, డబ్బుదాచే
చోట చీపురు ఉంచకూడదు. చీపురు వీటికి దగ్గరగా పెడితే ఇంట్లోకి రావల్సిన ధనం
రాదు.
ఏ దిక్కున ఉంచాలి
చీపురును ఎప్పుడూ కాలితో తాకకూడదు.
పొరపాటున కాలు తగిలిన చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురు ఇంట్లో నైరుతి
లేదా వాయవ్యంలో లేదా పడమర దిక్కున దాచి ఉంచాలి.
ఈశాన్యం, ఆగ్నేయంలో
చీపురును ఉంచకూడదు. ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమ: అని భగవన్నామ స్మరణతో
ప్రారంభిస్తే శనేశ్చరుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని నమ్మకం.
చీపురు ఎప్పుడు కొనాలి?
చీపురు కొనాలంటే శుక్రవారం , శనివారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధన వర్షం కురుస్తుంది.
పాతదైన
చీపురు బయట పడేసేందుకైనా, కొత్త చీపురు ఇంటికి తెచ్చుకునేందుకు కూడా
కొన్ని నియమాలు ఉన్నాయి. పాత చీపురు తీసేసి కొత్త చీపురు వాడడానికి శనివారం
మంచిది.
కృష్ణ పక్షంలో చీపురు కొనడం మంచిది. మంగళ వారం, శుక్రవారం,
మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే
రోజుల్లో కొత్త చీపురు కొని ఇంటికి తీసుకురావద్దు.
పాత చీపురు ఎప్పుడు పడెయ్యాలి?
పండగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజున ఇంట్లోని పాత చీపురు బయట పడెయ్యకూడదు.
రోహిణి
నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రాలు వచ్చిన
రోజుల్లో కూడా చీపురు కొన కూడదు. పాత చీపురు తీసెయ్య కూడదు.
ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం, బుధవారం, ఆదివారం మాత్రమే బయట పడేయాలి.
.png)







