VImp 1

"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః"
"ఓం నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ్"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
🙏ఓం అచ్యుతాయనమః 🙏ఓం అనంతాయనమః 🙏ఓం గోవిందాయనమః
భగవద్గీత సారాంశం
https://drive.google.com/file/d/1f2C1zp4G4atkRXG3gcChFxHkYaGbS6Ld/view
https://drive.google.com/file/d/1fFbST2b8XM13SBswK16LXwIIjeZfwWw-/view
కృష్ణ పక్షం (బహుళ పక్షం): అంటే అమావాస్యకు ముందు వచ్చే పదిహేను రోజులు.
శుక్ల పక్షం (శుద్ధ పక్షం): అంటే పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులు.
కంచి పరమాచార్య స్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ శ్లోకాన్ని 41 రోజుల పాటు రోజుకు 18 సార్లు పఠిస్తే ఆరోగ్యవంతులు అవుతారని చెప్పారు
https://www.youtube.com/watch?v=ZZoSm9gbF1g

Wednesday, December 11, 2024

"ఆచమనం" అనే పద్దతిని అందరూ పాటించాలి.

 

ఎసోఫెగస్ (Esophagus )

అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న ఏసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. ఏసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. 

భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్  సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే "ఆచమనం" అనే పద్దతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే  ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా?....

ఆలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా?....


కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు.

 ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనం చేస్తారు.   అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెస్ ని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 


గొంతులో ఎసోఫెగస్ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్థపద్దతిలో వ్యాయామం (వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. 


ఎందుకంటే,.... "కేశవ" నామం గొంతు లోనుంచీ వస్తుంది.

"నారాయణ" నామం నాలిక సహాయంతో వస్తుంది. "మాధవ" నామం పెదాల సహకారంతో వస్తుంది.  అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్ సైజు అన్న మాట.


మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో.... గ్లాసుతో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా?!!

మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో... చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి  అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పధం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.


ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు. వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరుకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ.... ఏదో ఒకరోజుకి దొరుకుతాయి. 


ఒక శాస్త్రీయవిధానాన్ని సింపుల్ గా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో.


ధర్మేణ లభతే సర్వం

ధర్మసారమిదం జగత్


ఆధునిక పోకడలు ఎక్కువై 

మన పెద్దలు ఏర్పరచిన సనాతన సాంప్రదాయంలోని అంశాలను అజ్ఞానంతో మూఢ నమ్మకాలుగా భావించకుండా

ఆ సాంప్రదాయం లోని విజ్ఞానాన్ని గ్రహించి మసలుకుంటే... మానవ జీవితం సుఖమయంగా సాగుతుంది...


🚩 జయహో సనాతనం 🚩


No comments:

Post a Comment

New List

------------------------------------------------------------------------------- A
అప్పు తీసుకోవడం బుధవారం మంచి రోజు (అర్థిక విషయాలకు అనుకూలంగా భావిస్తారు)
-------------------------------------------------------------------------------
బంగారు అప్పును తీర్చడానికి, మంగళవారం లేదా గురువారం మంచి రోజులుగా పరిగణించబడతాయి, ముఖ్యంగా రోహిణి లేదా పుష్య నక్షత్రాలు ఉన్నప్పుడు. ఈ రోజుల్లో అప్పులు తీర్చడం వలన అప్పుల భారం త్వరగా తొలగిపోతుందని, ఆర్థికంగా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
------------------------------------------------------------------------------- B
బట్టలు కొనడానికి మంచి రోజులు : సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం కొత్త బట్టలు కొనడానికి లేదా ధరించడానికి శుభప్రదంగా భావిస్తారు.
-------------------------------------------------------------------------------
బొద్దింకలను నివారించే మార్గాలు
లవంగాలు: లవంగాలను మెత్తగా చేసి, చిన్న సంచులలో కట్టి, బొద్దింకలు ఎక్కువగా ఉండే తేమ ప్రదేశాలలో, అల్మారాలలో ఉంచడం వల్ల వాటిని నివారించవచ్చు.
బిర్యానీ ఆకు (బే లీఫ్): బిర్యానీ ఆకులను పొడి చేసి, వంటగది కౌంటర్లపై, అల్మారాలపై మరియు తక్కువ శుభ్రం చేసే ప్రదేశాలలో చల్లడం వల్ల వాటి వాసనకు బొద్దింకలు పారిపోతాయి.
దాల్చినచెక్క: దాల్చినచెక్క పొడిని సమాన మొత్తంలో ఉప్పుతో కలిపి, బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో చల్లాలి. దీని బలమైన వాసన వాటిని తరిమికొడుతుంది మరియు వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది.
వేప ఆకులు: బొద్దింకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో వేప ఆకులను ఉంచడం వల్ల వాటిని మరియు ఇతర కీటకాలను తొలగించవచ్చు. ప్రతి మూడు రోజులకు ఆకులను మార్చడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వేప నూనె: బొద్దింక గుడ్ల కోసం, వేప నూనెను వేడి నీటితో కలిపి స్ప్రే బాటిల్ ఉపయోగించి పిచికారీ చేయవచ్చు.
------------------------------------------------------------------------------- C
చెప్పులు కొనడానికి అనుకూలమైనవి రోజులు: బుధవారం, శుక్రవారం
------------------------------------------------------------------------------- I
ఇనుము కొనుగోలుకు మంచి రోజు బుధవారం (Wednesday): బుధవారం కూడా ఇనుము కొనుగోలుకు మంచి రోజుగా చెప్పబడుతుంది
------------------------------------------------------------------------------- N
నూనె కొనడానికి మంచి రోజులు బుధవారం , గురువారం , మరియు శుక్రవారం
-------------------------------------------------------------------------------

All Links

https://bharathome.blogspot.com/
https://bharatinfo18.blogspot.com/
https://www.fakespot.com/analyzer
https://mytelugufamily.blogspot.com
https://www.onlinejyotish.com/telugu-astrology/telugu-jatakam.php
https://www.prakruthivanamorganicstore.in/
https://srivaddipartipadmakar.org/pravachanalu/ashtadasa-puranamulu/
https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/loginPage
https://samagri.karishye.co/
https://www.youtube.com/@learnGeeta18/playlists