కర్మ సిద్ధాంతం ఎలా : పనిచేస్తుందో చూడండి
కళ్ళు చెట్టు మీద వున్న పండుని చూశాయి.
మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా? అందుకే.. కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి.. పండును
కొయ్యడానికి
కాళ్ళు పండుని కొయ్యలేవు కాబట్టి చేతులు పండుని కోసాయి.
చేతులు పండుని తినలేవు కాబట్టి నోరు తినేసింది.. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది.
ఇప్పుడు చూడండి ఎవరు చూసారో
వాళ్ళు వెళ్ళ లేదు. ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు..
ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు
ఎవరు తిన్నారో.. వాళ్ళు ఉంచుకోలేదు.
ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది.
మరి ఇప్పుడు.... ఎప్పుడైతే తోటమాలి చూసాడో.. అప్పుడు దెబ్బలు... వీపు మీద పడ్డాయి... పాపం వీపు తప్పేమీ లేదు.
కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో....అప్పుడు కళ్ళనుండి నీళ్ళు వచ్చాయి.. కళ్ళనుండి ఎందుకంటే అందరికంటే ముందు. పండుని చూసింది "కళ్ళు".. కాబట్టి...
No comments:
Post a Comment